Monday, January 17, 2011

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట మసక బారు తోందా ?

అవును ఇది నిజం భారత రాజ కీయ చరిత్రలో అత్యధిక కాలం పాలించినటువంటి చరిత్ర ఉన్న పార్టీ యొక్క ప్రతిష్ట మసక బారుతుంది అనే చెప్పాలి ..... ఎన్నడు లేనట్టు  ఒక దాని తర్వాత ఒకటి కుంభ కోణాలు వెలుగు  చూసి ఒక వైపు, మరొక వైపు ప్రత్యెక రాష్ట్ర ఉద్యమాల తో  ఎటు తేల్చుకో లేక .... కాంగ్రెస్ పార్టీ దిక్కు తోచని పరిస్థితి లో ఉంది . 

                         కాంగ్రెస్ ప్రభుత్వం రెండో సారి కేంద్రం లో రావడానికి కారణ  మైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో నాయకత్వ లోటు స్పష్టం గ కనిపిస్తుంది ..వై ఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం తర్వాత సంభవిచినటువంటి సంఘటనలు  రాష్ట్ర చరిత్రనే మార్చే విధం గ తయారయ్యాయి ... తినమంటే కప్ప కి  కోపం .. వదల మంటే పాము కి కోపం అన్నట్టు .... తెలంగాణా సీమంధ్ర లు గా రాజకీయ నాయకులే కాకుండా ప్రజలు కూడా విడిపోయి నట్టు ప్రవర్తిస్తున్నారు ..... ఈ పాపం కచ్చితముగా  రాష్ట్రం లో  కేంద్రం  లో అధికారం లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దే .... తుమ్మితే ఊడిపోయే ముక్కు వలె మన రాష్ట్ర సర్కారు ఉన్నట్లు అనిపిస్తోంది ..... మళ్లీ కుర్చీలాట మొదలయినట్టు అనిపిస్తోంది ..... ఒక వైపు ఎన్నడు అభి వృద్ధి అనే మాటను ఎరుగానట్టి    బీహార్ లాంటి రాష్ట్రాలు అభివృద్ధి  చెందుతుంటే మన రాష్ట్రం మాత్రం అధ పాతాళానికి పోయినట్టు అనిపిస్తోంది ...... మరో వైపు గుజరాత్ మన రాష్ట్రానికి రావాల్సినఅటువంటి ప్రాజెక్టులను  తమ రాష్ట్రాలకు తరలిచేసుకుంటున్నాయి ...... దీని కంతటికీ కారణం సమర్థ మైన నాయకత్వ లోపమే ..... మరి ఇలాంటి కాంగ్రెస్ పార్టీ తిట్టని వాళ్ళు మన రాష్ట్రము లో ఉండరు అని అంటే అతిశయోక్తి కాదేమో అని నాకు అనిపిస్తోంది   మరి మీరు ఏమి అంటారు ?....

నేటి దర్పణమునకు స్వాగతం

నేటి సమాజములో జరుగుతున్నటువంటి విషయాలే కాకుండా అన్ని విషయాలపైన నా యొక్క భావాలను తెలియ పరచడానికి ఈ బ్లాగ్ ఒక మధ్యమము గా ఉంటుంది .......